: మిస్బా అవుట్... గెలుపు సంబరాలు మొదలుపెట్టిన భారత్ అభిమానులు
అడిలైడ్ మ్యాచ్ పూర్తికాకముందే టీమిండియా అభిమానులు గెలుపు సంబరాలకు తెరదీశారు. ధోనీ సేన విజయానికి మరో వికెట్ దూరంలో నిలవడంతో అభిమానుల ఆనందం అంబరాన్నంటుతోంది. 203 పరుగుల జట్టు స్కోరు వద్ద యాసిర్ షా (13), 220 పరుగుల వద్ద మిస్బా (76) అవుటయ్యారు. దీంతో, పాక్ 9 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఇర్ఫాన్ (0 బ్యాటింగ్), సొహయిల్ ఖాన్ (4 బ్యాటింగ్) ఉన్నారు.