: నిదానంగా సాగుతున్న పాక్ ఇన్నింగ్స్
అడిలైడ్ లో భారత్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. భారత్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... డ్రింక్స్ సమయానికి పాక్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలో దిగిన స్టార్ ఆటగాడు యూనిస్ ఖాన్ 6 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. పాక్ విజయం సాధించాలంటే 34 ఓవర్లలో 229 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ అహ్మద్ షేజాద్ (28 బ్యాటింగ్), సొహయిల్ (31 బ్యాటింగ్) ఉన్నారు.