: చిభాభా, మసకద్జ అర్ధ సెంచరీలు... నిదానంగా లక్ష్యంవైపు సాగుతున్న జింబాబ్వే
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే నిదానంగా లక్ష్యం వైపు సాగుతోంది. ప్రస్తుతం 36.1 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది. ఓపెనర్ సికందర్ రజా 5 పరుగులు చేసి అవుట్ కాగా, చిభాభా, మసకద్జ అర్ధ సెంచరీలు సాధించారు. చిభాభా 64, మసకద్జ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మిలర్ల్(138 నాటౌట్), డుమిని(115 నాటౌట్)లు సెంచరీలు సాధించి అజేయంగా నిలిచారు.