: పాక్ కోడలు... భారత్ గెలవాలని కోరుకుంటోంది!
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. మరి రెండు దేశాలకూ సంబంధించిన వాళ్ల విషయం ఏమిటి? తాను సహజంగానే భారతదేశం గెలవాలని కోరుకుంటానని, తన మద్దతు ఎప్పుడూ, ఇండియాకేనని పాకిస్తాన్ కోడలు, హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటోంది. ఇప్పటికే ప్రపంచకప్ లో పాకిస్థాన్ మీద భారత్ 5-0 ఆధిక్యంతో విజయాలు నమోదు చేసుకుందని, ఆరోసారి కూడా కచ్చితంగా మన దేశమే గెలుస్తుందని చెబుతోంది. పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సానియా, ఈ రెండు జట్ల మధ్య పోటీ జరిగితే మాత్రం టీమిండియా వైపే మొగ్గు చూపిస్తుంది. రెండు టీవీ ఛానళ్లకు కామెంట్రీ చెప్పడం కోసం షోయబ్ మాలిక్ భారత్ లో ఉన్నాడని, అందువల్ల తాను దుబాయ్ లో మ్యాచ్ ను ఒంటరిగా టీవీకి అతుక్కుపోయి చూడకతప్పదని సానియా చెప్పింది.