: 107 పరుగులు చేసి కోహ్లీ అవుట్... రంగంలోకి ధోనీ
వరల్డ్ కప్ పోటీల్లో పాకిస్తాన్ పై సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ 107 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సొహైల్ ఖాన్ బౌలింగ్ లో కీపర్ అక్మల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తం 126 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 8 ఫోర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. కోహ్లీ అవుట్ అయిన తరువాత కెప్టెన్ ధోనీ రంగంలోకి దిగి తాను ఎదుర్కొన్న రెండో బంతికే ఫోర్ కొట్టి స్కోర్ వేగం తగ్గనివ్వనన్న సంకేతాలు పంపాడు. ప్రస్తుతం భారత స్కోర్ 46 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 279 పరుగులు.