: కోహ్లీ సెంచరీ... రైనా హాఫ్ సెంచరీ... పాకిస్తాన్ బౌలర్లను ఆటాడుకుంటున్న భారత ఆటగాళ్లు!


భారత ఆటగాళ్లు పాకిస్తాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎవరు బౌలింగ్ కు వచ్చినా, బెదరక తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. వన్ డౌన్ గా బరిలో దిగిన కోహ్లీ 119 బంతుల్లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. కోహ్లీకి అండగా మరో ఎండ్ లో రైనా 40 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రైనా ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, 3 సిక్స్ లు ఉన్నాయి. 119 బంతుల్లో సెంచరీ చేసిన కోహ్లీ 7 ఫోర్లను బాదాడు. ప్రస్తుతం భారత స్కోర్ 43 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 245 పరుగులు. మరో 7 ఓవర్లు మిగిలి ఉండగా ఇండియా స్కోర్ 300 పరుగులు దాటితే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News