: 4 ఓవర్ల సంయమనం తరువాత జూలు విదిల్చిన రోహిత్, ధావన్
నిదానంగా ప్రారంభం అయిన భారత ఇన్నింగ్స్ నాలుగు ఓవర్లపాటు చప్పగా సాగింది. తొలి ఫోర్ కోసం ఇండియా అభిమానులు 4వ ఓవర్ 5వ బంతి వరకూ వేచిచూడాల్సి వచ్చింది. సొహైల్ ఖాన్ వేసిన బంతిని ధావన్ బౌండరీకి తరలించగా, 5వ ఓవర్లో ఏడడుగుల పొడగరి మొహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు కొట్టాడు. భారత స్కోర్ ప్రస్తుతం 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగుల వద్ద కొనసాగుతోంది.