: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు
మరికొన్ని నిమిషాల్లో చిరకాల ప్రత్యర్థుల భీకర యుద్ధం ప్రారంభంకానుంది. ఇప్పటికే అడిలైడ్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసి పోగా, టాస్ గెలిచిన కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇటీవలి మ్యాచ్ లలో ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.