: నారా లోకేష్ కు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష
గత రాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ తారసపడ్డాడు. లోకేష్ తన కారులో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45 నుంచి ఇంటికి వెళ్తుండగా పెద్దమ్మ గుడి వద్ద రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపారు. ఆ సమయంలో డ్రైవింగ్ సీటులో లోకేష్ ఉన్నారు. పోలీసులు ఆయనను చూసి 'డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం' అని చెప్పగా, వెంటనే లోకేష్ కిందకు దిగి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేసుకోవాలని సూచించారు. పోలీసులు పరీక్షించిన అనంతరం ఆయన వెళ్తుండగా, సహకరించినందుకు అక్కడున్న అధికారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.