: తెలంగాణ మునిసిపాలిటీల్లో ఇక అవిశ్వాస తీర్మానం కుదరదు... కీలక నిర్ణయం దిశగా సర్కారు చర్యలు


ఇకపై తెలంగాణలోని మునిసిపాలిటీల్లో కొలువుదీరే పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష సభ్యులకు అవకాశం ఉండదు. మునిసిపల్ ఎన్నికల్లో ఒక్కసారి ఎన్నికైతే ఐదేళ్ల వరకు సదరు పాలక వర్గాలే పాలనను కొనసాగించనున్నాయి. ఈ దిశగా కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతోంది. నేడు మునిసిపల్ శాఖాధికారులతో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. మునిసిపాలిటీల్లో నిరంతర అబివృద్ధిని కొనసాగించడం, పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకే ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News