: రేపు హస్తినకు ఏపీ సీఎం... ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రేపు ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు, పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 6.45 కు ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర అర్థిక పరిస్థితి తదితరాలను చంద్రబాబు, మోదీ వద్ద ప్రస్తావించనున్నారు. అంతేకాక నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదలపైనా చంద్రబాబు, మోదీతో మాట్లాడనున్నట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు, అమిత్ షా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు.