: మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, కేసీఆర్... పరిష్కారానికి నోచుకోని అంశాలపై దృష్టి
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు మరోమారు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలపై తాజా భేటీలో దృష్టి సారించాలని ఇరువురు నేతలు ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. సమావేశం తేదీలను ఖరారు చేసేందుకు ఏపీ సీఎంఓ అధికారులు తెలంగాణ సీఎంఓ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో విభజన చట్టంలోని సమస్యలన్నీ దాదాపుగా పరిష్కారమవుతాయన్న వాదన వినిపిస్తోంది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా పాలుపంచుకుంటారని సమాచారం.