: కుడి కాలువకు 7 వేల క్యూసెక్కులు... 4, 5 గేట్లు ఓపెన్


తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. నిలిచిపోయిన ఏపీ జల విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తూ కుడి కాలువ నుంచి 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు అంగీకరించింది. వెనువెంటనే సదరు నిర్ణయాన్ని అమల్లోకి తెస్తూ సాగర్ ప్రాజెక్టులోని 4, 5 గేట్లను తెలంగాణ అధికారులు ఎత్తివేశారు. సాగర్ లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఏపీ పరిధిలోని సాగర్ పవర్ హౌస్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. నీటి విడుదలకు ఏపీ చేసిన ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిన్న ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు పైటింగ్ కు దిగారు. నేటి ఉదయం ఇరు రాష్ట్రాల సీఎంలు గవర్నర్ సమక్షంలో నిర్వహించిన చర్చలు ఫలించాయి. అనంతరం ఇరు రాష్ట్రాల ఇంజినీర్-ఇన్-చీఫ్ లు సమీక్ష జరిపి 7 వేల క్యూసెక్యూల నీటి విడుదలకు ఒప్పందం చేసుకున్నారు. వెనువెంటనే నీటి విడుదల ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News