: శివరాత్రి స్పెషల్... శ్రీశైలానికి 1400 బస్సులు


ఈ నెల 17న మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ బస్సులతో ఆర్టీసీ జాతర చేయనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి 1400 బస్సులను నడపనున్నారు. అయితే బస్సులన్నీ శ్రీశైలం యజ్ఞవాటిక వరకు మాత్రమే నడవనున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారని ఆర్టీసీ పేర్కొంది. కాగా, శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో మహాశివుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. దీంతో శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యక సౌకర్యాలు కల్పించింది.

  • Loading...

More Telugu News