: పాఠశాలలో మరుగుదొడ్లు లేవని టీచర్ల జీతాలు నిలిపేసిన కలెక్టర్!


పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు విడుదల చేస్తున్నాయి. సదరు నిధులు రాష్ట్ర, జిల్లా స్థాయుల నుంచి క్షేత్ర స్థాయికి వేగంగానే చేరిపోతున్నాయి. మెజారిటీ ప్రాంతాల్లో ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో సకాలంలోనే మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. అయితే , కొంతమంది ‘మొద్దు’ ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలకు చేరిన నిధులను బ్యాంకు ఖాతాల నుంచి బయటకు తీయడం లేదు. ఇలాంటి ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో మౌలిక వసతులు కలగానే మిగిలిపోతున్నాయి. మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ భార్గవ ఉపాధ్యాయుల ఈ నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించారు. నేడు ఉదయ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలను పరిశీలించిన ఆయన, కొన్ని పాఠశాలల్లో నిధులున్నా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాని విషయాన్ని గుర్తించారు. అందుకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని తెలుసుకున్నారు. వెనువెంటటనే సదరు పాఠశాలలకు చెందిన 25 మంది ఉపాధ్యాయుల వేతనాలను నిలుపుదల చేయాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తన కార్యాలయం నుంచి తదుపరి ఆదేశాలు జారీ అయ్యేదాకా వారి వేతనాలను విడుదల చేయరాదని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News