: నల్ల బంగారం కోసం అంబానీలు, ఆదానీలు, బిర్లాల మధ్య పోరు!
ఇండియాలోని బొగ్గు గనుల వేలం నేడు మొదలైంది. ఈ వేలంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా గుర్తింపున్న అంబానీ సోదరులతో పాటు ఆదానీలు, బిర్లాలు పోటీ కూడా పడుతున్నారు. నల్ల బంగారం గనులు పొందితే, మరిన్ని లాభాలు వెనకేసుకోవచ్చన్న ఉద్దేశంతో వీరు రంగంలోకి దిగడంతో ప్రభుత్వం అంచనా వేసిన మొత్తం కన్నా అధికంగా ఖజానాకు చేరవచ్చని అంచనా. వీరితో పాటు బిడ్డింగ్ కు అనుమతులు పొందిన జీఎంఆర్, వేదాంత, ఎస్సార్, హిందాల్కో, జిందాల్ స్టీల్, భారత్ అల్యూమినియం, జీవీకే తదితర కంపెనీలూ బిడ్లను దాఖలు చేస్తున్నాయి. ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని గనులకు ఈ వేలం జరుగుతోంది.