: ఆస్ట్రేలియాపై తొలి రోజే హ్యాట్రిక్ నమోదు చేసిన ఫిన్


వరల్డ్ కప్ తొలి రోజే హ్యాట్రిక్ నమోదైంది. సాధారణంగా వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో చిన్న జట్లపై హ్యాట్రిక్స్ నమోదవుతుంటాయి. అలాంటి సంప్రదాయానికి భిన్నంగా ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేసిన ఫిన్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. ధాటిగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు చివరి ఓవర్లో ఇంగ్లండ్ బౌలర్ ఫించ్ షాకిచ్చాడు. వరుసగా ముగ్గురు బ్యాట్స్ మన్ ను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశారు. 50వ ఓవర్లో 4వ బంతిని ఇన్ స్వింగర్ గా సంధించిన ఫిన్ సఫలమయ్యాడు. హడిన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి బ్రాడ్ చేతుల్లో వాలింది. తరువాతి 5వ బంతిని భారీ షాట్ గా మలిచేందుకు మ్యాక్స్ వెల్ ప్రయత్నించగా, దూరం నుంచి పరుగెత్తుతూ వచ్చిన రూట్ దానిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో 66 పరుగుల వద్ద మ్యాక్స్ వెల్ అవుటయ్యాడు. అనంతరం ఇన్నింగ్స్ చివరి బంతిని ఫిన్ తెలివిగా సంధించాడు. భారీ షాట్ కు యత్నించిన జాన్సన్ మిడ్ ఆఫ్ లో ఆండర్సన్ కి దొరికిపోయాడు. దీంతో ఈ వరల్డ్ కప్ లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా ఫిన్ రికార్డు పుటలకెక్కాడు.

  • Loading...

More Telugu News