: తమిళనాట రూ.1.44 కోట్ల విలువైన పైరసీ డీవీడీల పట్టివేత... ఆరు థియేటర్ల ఓనర్లు సహా 390 మంది అరెస్ట్
తమిళనాడులో భారీ పైరసీ రాకెట్ ను పోలీసులు కనిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేసి రూ.1.44 కోట్ల విలువైన లక్షలాది పైరసీ డీవీడీలు, సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరు సినిమా హాళ్ల యజమానులు సహా 390 మందిని అరెస్ట్ చేసినట్టు తమిళనాడు పోలీసులు తెలిపారు. పైరసీ డీవీడీలు, సీడీల వ్యాపారం చేస్తున్న వారిపై ఈ ఏడు మొత్తం 5,875 కేసులు పెట్టినట్టు వివరించారు. అనధికారికంగా కెమెరాలతో సినిమాలను రికార్డు చేసినందుకు, సినిమాటోగ్రఫీ చట్టం కింద ఆరుగురు సినిమా థియేటర్ల యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. విరుదునగర్, మధురైలలో రెండు చొప్పున, దిండిగల్లు, కోయంబత్తూరులోని ఒక్కో థియేటర్ పైనా కేసులు పెట్టినట్టు తెలిపారు.