: సామరస్యపూర్వక వాతావరణం పాడుచేయవద్దు: కేసీఆర్ కు బాబు


తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సామరస్యపూర్వక వాతావరణం పాడుచేయవద్దని సూచిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. నాగార్జునసాగర్ కుడికాల్వపై వివాదం అర్థం లేనిదని, అవసరమైతే గవర్నర్ సమక్షంలో సరిచేసుకుందామని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి సూచించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో రేపు ఉదయం 10:00 గంటలకు ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు రాజ్ భవన్ లో రాష్ట్రపతి ఎదుట సమావేశం కానున్నారు. ఈ సమావేశం తరువాతైనా జలవివాదంపై ఓ స్పష్టత రావాలని రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News