: ఉక్రెయిన్ పార్లమెంటులో పిడిగుద్దులు కురిపించుకున్న ఎంపీలు


ఉక్రెయిన్ పార్లమెంటులో ఇద్దరు ఎంపీలు బాహాబాహీకి దిగారు. వీధి రౌడీల్లా ఫైటింగ్ కు దిగి రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ఉక్రెయిన్ పార్లమెంటులో అవినీతి నిరోధక బిల్లు మీద చర్చ జరుగుతున్న సందర్భంగా సెల్ఫ్ రిలయన్స్ పార్టీకి చెందిన ఎగోర్ సొబొలేవ్, ఫాదర్స్లాండ్ పార్టీకి చెందిన వాదిమ్ ఇవ్ చెంకోల మధ్య వాగ్యుద్ధం ముదిరింది. మాటామాటా పెరగడంతో ఇద్దరూ దెబ్బలాటకు దిగారు. ఒకర్నొకరు తిట్టుకుంటూ బాక్సింగ్ కు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాగా, ఘర్షణకు దిగిన ఇద్దరు ఎంపీలు మితవాద పార్టీలకు చెందిన వారు కావడం, తిరుగుబాటుదారులతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన రోజే ఎంపీలు పరస్పరం దాడులు చేసుకోవడం విశేషం. ఉక్రెయిన్ లో ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

  • Loading...

More Telugu News