: శ్రీలంకతో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో ఆసీస్... రేపటి నుంచి వరల్డ్ కప్ పోటీలు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2015 పోటీలు శనివారం నుంచి జరగనున్నాయి. టోర్నీ తొలి రోజు 2 మ్యాచ్ లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ లో జరుగుతుంది. రెండో మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు 'పూల్-ఎ'లో ఉన్నాయి.