: సరిగా కూర్చోలేకపోతున్న కేజ్రీవాల్... నేటి సమావేశాలు రద్దు


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం నుంచి కోలుకోలేదు. ఆయన ఇంకా జ్వరంతో బాధపడుతున్నారు. జ్వర తీవ్రత పెరగడంతో కేజ్రీ సరిగా కూర్చోలేకపోతున్నారు. దీంతో, శుక్రవారం జరపాల్సిన సమావేశాలను పార్టీ వర్గాలు రద్దు చేశాయి. గొంతునొప్పి కూడా ఉండడంతో ఆయన మాట్లాడలేకపోతున్నారట. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించగా, జ్వరం కారణంగా ఆయన వేడుకలను మధ్యలోనే వదిలేసి నివాసానికి వెళ్లిపోవడం తెలిసిందే. రేపు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

  • Loading...

More Telugu News