: ప్రభుత్వాసుపత్రుల్లో రాత్రి బస... ఇప్పుడు ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని వంతు!


ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బర్తరఫ్ నకు గురైన రాజయ్య పదవిలో ఉండగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టడం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నడుస్తున్నారు. తాజాగా, కామినేని శ్రీనివాస్ కూడా ప్రభుత్వాసుపత్రుల్లో రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నేటి రాత్రి ఆయన విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో బస చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు. పదవిలో ఉండగా, పలు ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో రాత్రి బస చేసిన రాజయ్య, సదరు సర్కారీ దవాఖానాల్లో వసతులు, సేవల మెరుగు కోసం కృషి చేశారు. అయితే, ఆ శాఖలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు.

  • Loading...

More Telugu News