: ఐదేళ్ల బాలిక అత్యాచార ఘటనపై సుష్మ స్పందన


ఢిల్లీలో తాజాగా అత్యాచారానికి గురైన ఐదు సంవత్సరాల బాలిక ఘటనపై లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలికను తక్షణమే ఏఐఐఎమ్ఎస్ (ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు తరలించి, మెరుగైన చికిత్స అందివ్వాలని ఆమె డిమాండు చేశారు. ఘోరమైన అత్యాచారానికి గురైన ఈ బాలిక గురించి తెలుసుకుని తాను భయోత్పాతానికి గురయ్యానని సుష్మ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారి ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నెల 14న ఈ ఐదేళ్ల చిన్నారిని పక్కింటి వ్యక్తే నాలుగురోజుల పాటు నిర్భంధించి, అనేకసార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పు ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News