: మహిళను హత్య చేసి స్టోరేజ్ కేబినెట్ లో దాచిన ముంబై ఫ్యాషన్ డిజైనర్


ఆమె దుస్తులను వినూత్నంగా తయారు చేయడమే కాదు, హత్య చేయడంలోనూ అంతే వినూత్నత చూపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, ఆ ఫ్యాషన్ డిజైనర్ ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫ్యాషన్ డిజైనర్లు ఉజ్వల వీర్, ప్రీతి అనే ఇద్దరు మహిళలు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. గతంలో ప్రీతి భర్త దగ్గర ఉజ్వల రూ.20 వేలు అప్పుగా తీసుకుంది. అప్పు తిరిగి చెల్లించాలని ప్రీతి పలుమార్లు ఒత్తిడి తెచ్చింది. తన భర్తతో ఉజ్వల సన్నిహితంగా ఉండటంపైనా ఆమె ఉజ్వలను ప్రశ్నించింది. ఈ క్రమంలో వీరి మధ్య పలుమార్లు గొడవలు వచ్చాయి. దీంతో, ప్రీతిని అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్న ఉజ్వల ఆమెను దారుణంగా హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని తన ఇంట్లోనే సోఫా కింద స్టోరేజ్ కేబినెట్ లో దాచి పెట్టింది. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతిని హత్య చేశారంటూ కేసు పెట్టింది. పోలీసుల విచారణలో ఆమెను తానే హత్య చేసినట్టు అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఉజ్వలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

  • Loading...

More Telugu News