: నేను కీలుబొమ్మను కాదు... రాజీనామా చేసేదిలేదు: బీహార్ సీఎం


కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగా తాను ప్రవర్తిస్తున్నానంటూ జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీహార్ సీఎం జితన్ రాం మాంఝీ స్పందించారు. తాను కీలుబొమ్మను కానని, సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. "నితీశ్ పెద్ద తప్పే చేశారు. నేను తోలుబొమ్మనని అనుకోరాదు. రాజీనామా చేయబోను. నేను తప్పు చేశానని నీవు (నితీశ్) నిరూపిస్తే వైదొలగుతా" అని మాంఝీ స్పష్టం చేశారు. కాగా, శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని మాంఝీకి బీహార్ గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News