: ఉదయ్ పూర్ లో జెన్నీఫర్ లోపెజ్, అక్షయ్ కుమార్


ఉదయ్ పూర్ లో అంతర్జాతీయ పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ (జేలో) సందడి చేసింది. ఉదయ్ పూర్ కు అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు క్యూ కట్టారు. అకస్మాత్తుగా ఉదయ్ పూర్ కు హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు క్యూ కట్టడానికి కారణం భారతీయ బ్రిటన్ వ్యాపారవేత్త సంజయ్ హిందూజా వివాహవేడుక. ఈ వేడుకలో పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ తో పాటు, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు. కాగా ఈ నెల 10 న ప్రారంభమైన వీరి పెళ్లి వేడుకలో పుస్సీకేట్ డాల్ నికోల్ స్క్వార్జ్ నెగ్గర్, బాలీవుడ్ హీరోలు రణ్ వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ లు తమ ప్రదర్శన ఇచ్చారు. ఈ వివాహవేడుకకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా వ్యాపారవేత్త సంజయ్ హిందూజా ప్రముఖ డిజైనర్ అనుమహతని వివాహమాడనున్నారు.

  • Loading...

More Telugu News