: ప్రజలు సుఖంగా ఉండాలంటే టీఆర్ఎస్ అధికారంలో ఉండాలి: కవిత
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలని సీఎం కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో, బెల్లంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు గులాబీ కండువా శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బొగ్గు గని కార్మికుల కష్టాలు తీరుస్తామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కవిత నేడు జిల్లాలోని ఆసిఫాబాద్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, రోడ్ షో నిర్వహించారు. అటుపై సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీ సీఎం తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని అన్నారు. సీమాంధ్ర రాజకీయాలు తెలంగాణలో వద్దని పేర్కొన్నారు. ఏపీ సీఎం అక్కడి వ్యవహారాలు చూసుకుంటే మంచిదని హితవు పలికారు.