: సీపీఎంను విలీనం చేయం... బలోపేతం చేస్తాం: బృందా కారత్


పార్టీని విలీనం చేసేది లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. విశాఖపట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన 21వ సీపీఎం అఖిల భారత వెబ్ సైట్ ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్టణానికి హుదూద్ తుపాను సాయంపై స్పష్టంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వాలు హామీలతోనే సరిపెట్టుకుంటున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాలు, మనోభావాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చిస్తామని ఆమె తెలిపారు. సీపీఎం పార్టీని బలోపేతం చేస్తామని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News