: కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవానికి సోషల్ మీడియాలో ఆహ్వానం


ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవానికి అందరినీ ఆహ్వానించారు. ఈ నెల 14న రామ్ లీలా మైదానంలో 11 గంటలకు జరిగే ఈ వేడుకకు అందరికీ ఇదే తన ఆహ్వానం అంటూ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఆహ్వానించారు. ఆయన మాట్లాడిన వీడియోను సామాజిక వెబ్ సైట్లలో పోస్టు చేశారు. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ ల్లోని కేజ్రీవాల్ ఖాతాలు, పార్టీ ఖాతాల్లో కూడా ఈ వీడియోను పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News