: హైదరాబాదు బ్రాండ్ అంబాసడర్ రేసులో నితిన్!
హైదరాబాదు బ్రాండ్ అంబాసడర్ గా మహేశ్ బాబుతోపాటు నితిన్ పేరును కూడా టీఆర్ఎస్ సర్కారు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరితో పాటు మరో నటుడు కూడా రేసులో ఉన్నట్టు తెలిసింది. అయితే, అతని పేరు వెల్లడి కావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో బ్రాండ్ అంబాసడర్ ఎవరన్నది తేలనుంది. ప్రస్తుతం దీనిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా, వివాద రహితుడు కావడం మహేశ్ కు అనుకూలించే అంశం కాగా, తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం నితిన్ కు అనుకూలాంశం. వీలైతే ఇద్దరినీ ప్రచారకర్తలుగా నియమించాలని కేసీఆర్ యోచిస్తున్నారట.