: చదివేది మాత్రమే ట్రిపుల్ ఐటీ... సరైన తిండికి కూడా దిక్కులేదు... రోడ్డెక్కిన బాసర విద్యార్థులు
ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమకు సరైన భోజనం పెట్టడం లేదంటూ ఆందోళనకు దిగారు. మెస్ నిర్వాహకులు నాసిరకం వంటకాలతో తమ కడుపులు కొడుతున్నారని వారు తెలిపారు. మెస్ నిర్వాహకుల వైఖరికి నిరసనగా నేటి మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ ప్రధాన కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఉన్నతాధికారుల నుంచి హామీ రావడంతో విద్యార్థులు తమ ఆందోళనలను విరమించారని తెలుస్తోంది.