: కాంగ్రెస్ లో అసలు గాంధీలు లేరు... అరువు గాంధీలే ఉన్నారు: జేసీ


కేంద్రంపై ధ్వజమెత్తిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసలు గాంధీలు లేరని, అరువు గాంధీలే ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా ధ్వజమెత్తారు. వారిద్దరూ వెళ్లిపోతేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ అని స్పష్టం చేశారు. ఇక, వైఎస్సార్సీపీ పైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన జేసీ... రాష్ట్రంలో ఆ పార్టీకి నాయకుల్లేరని, నాయకుల్లేని పార్టీ ప్రజలకు ఏం చేస్తుందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News