: సునంద కేసులో థరూర్ ను ప్రశ్నించిన సిట్
భార్య సునందా పుష్కర్ హత్య కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ మరోసారి ప్రశ్నించింది. ఈ ఉదయం 10.30 గంటలకు ఆయనను ఢిల్లీలో వసంత్ విహార్ లోని సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈసారి కూడా 20 ప్రశ్నలను థరూర్ కు సంధించినట్టు సిట్ సమాచారం. ఇదే సమయంలో థరూర్ పని మనుషులు నారాయణ్ సింగ్, భజరంగిలను కూడా ప్రశ్నించేందుకు అధికారులు పిలిచారు. సునందా కేసులో ఆయనను విచారించడం ఇది రెండవసారి. అంతకుముందు జనవరి 19న థరూర్ ను సిట్ తొలిసారి ప్రశ్నించిన సంగతి విదితమే.