: కేంద్ర ప్రభుత్వంపై జేసీ దివాకర్ రెడ్డి ఫైర్
గత కొంత కాలంగా మౌనంగా ఉన్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒక్కసారిగా జూలు విదిలించారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. తన దృష్టిలో చట్ట సభలన్నీ వృథాగా మారిపోయాయని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనలాంటి వారి సలహాలను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమలాంటి వారి మాటలను విననప్పుడు ఎంపీల ఎన్నికలు ఎందుకని ప్రశ్నించిన జేసీ... ఎంపీల ఎన్నికల బదులు నేరుగా ప్రధానినే ఎన్నుకోవచ్చు కదా? అని అన్నారు. ఆప్ దెబ్బకు ఢిల్లీలో బీజేపీ మట్టికరిచిందని సెటైర్ విసిరారు.