: బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే బీహార్ గవర్నర్ అలా ప్రవర్తిస్తున్నారు: నితీశ్ కుమార్


బీహార్ గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠిపై జేడీయూ నేత, మాజీ సీఎం నితీశ్ కుమార్ ఆరోపణలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలం, అత్యున్నత స్థాయిలో వారు రాసిచ్చిన స్ర్కిప్టు మేరకు ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీహార్ లో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీల్లా బీహార్ లో కూడా పార్టీలను నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని జేడీ(యూ) నేత, రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి అన్నారు. శాసనసభపక్ష నేతగా నితీశ్ ఎన్నికపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడంతో అసెంబ్లీలో మాంఝీని బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో నితీశ్ పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News