: సెల్ బిల్లులకు కూడా డబ్బుల్లేని ఏపీ... సేవలు నిలిపిన ఎయిర్ టెల్!
ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా రెవిన్యూ అధికారుల సెల్ ఫోన్లు మూగబోయాయి. బిల్లులు కట్టక పోవడంతో రెవెన్యూ ఉద్యోగులకు ఉండే ప్రభుత్వ సెల్ ఫోన్ల అవుట్ గోయింగ్ సౌకర్యాన్ని ఎయిర్ టెల్ నిలిపివేసింది. ఈ మేరకు ఎయిర్ టెల్ ఒక ప్రకటన వెలువరించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్ళలేని స్థితి నెలకొంది. కాగా, పలు ఇతర జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం.