: టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టబోయిన యువకుడిని చితకబాదిన తెలుగు తమ్ముళ్లు
వరంగల్ జిల్లా హన్మకొండ రోడ్డుపై టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తగులబెట్టే ప్రయత్నం చేసిన యువకుడిని అక్కడి తెలుగు తమ్ముళ్లు చితకబాదారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని వరంగల్ పర్యటనకు స్వాగతం పలుకుతూ, స్థానిక నేతలు కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని ధ్వంసం చేసే ఆలోచనతో ఓ యువకుడు అక్కడికి వచ్చి, వాటిని తగులబెట్టబోగా, పక్కనే ఉన్న టీడీపీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడిని అడ్డుకుని పిడిగుద్దులు గుద్ది, ఆ వ్యక్తి ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.