: నిజామాబాదులో న్యాయమూర్తులను అడ్డుకున్న న్యాయవాదులు
తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, నిజామాబాద్‌లో న్యాయవాదులు కోర్టు ముందు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా కోర్టుకు తాళం వేసి, కోర్టు లోపలికి న్యాయమూర్తులు వెళ్లకుండా లాయర్లు అడ్డుకున్నారు. హైకోర్టు కలిసి ఉండగా న్యాయమూర్తుల పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల తెలంగాణ న్యాయవాదులకు తీరని అన్యాయం జరుగుతుందని లాయర్లు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ ను వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.