: ఇండియాపై ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్న పాకిస్తాన్ ఎయిర్ లైన్స్... వెల్లడించిన 'రా'


పాకిస్తాన్ అధికారిక విమానయాన సంస్థ పీఐఏ (పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్) ఇండియాపై ఉగ్రదాడికి ప్రణాళికలు రూపొందిస్తూ ఉండవచ్చని రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) హెచ్చరికలు జారీ చేసింది. పీఐఏ కరాచి కార్యాలయంలో ఒక ఉగ్రవాదిని విధుల్లోకి తీసుకున్నారని 'రా' తెలియజేసింది. కాగా, ఢిల్లీలోని అత్యంత ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన కన్నాట్ ప్లేస్ లో పీఐఏ కొనుగోలు చేసిన ఆస్తులను తక్షణం విక్రయించాలని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ లావాదేవీకి అధికారిక అనుమతులు లేవని ఈడీ తెలిపింది. సీమాంతర గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి 1965లో పాకిస్తాన్ తో యుద్ధం తరువాత 'రా'ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News