: నేనేమీ పిరికివాడిని కాదు... పారిపోవడం నా రక్తంలోనే లేదు: ఏపీ సీఎం చంద్రబాబు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్నటి విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనేమీ పిరికివాడిని కాదు. అవరోధాలను, ఇబ్బందులను, సమస్యలను చూసి పారిపోయే తత్వం నా రక్తంలోనే లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా, పోరాడి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు, రాష్ట్రాభివృద్ధి తదితరాలను చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలో అనేక ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించానన్నారు. కేంద్రం, రిజర్వ్ బ్యాంకు సహకరించకపోయినా, రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేశానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News