: పది రోజుల్లో గుంటూరు వెళ్లండి... వసతి కోసం డార్మెట్రీలు... మంత్రి ఆదేశాలపై ఉద్యోగుల గుర్రు!
ఈ నెల 20 నాటికి మున్సిపల్ కమిషనర్, డెరైక్టరేట్ పరిధిలో ఉన్న ఉద్యోగులంతా గుంటూరుకు వెళ్లి అక్కడి నుంచి పరిపాలనా పనులు సాగించాలని పురపాలక మంత్రి నారాయణ ఆదేశించడం ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేసింది. మార్కెట్ యార్డ్ భవనంలో తాత్కాలిక ఆఫీసు ఏర్పాటు చేశామని, వసతికి అదే కార్యాలయంలో డార్మెట్రీలు ఏర్పాటు చేసినట్టు అనడంతో ఉద్యోగుల్లో కలకలం రేపినట్టు తెలుస్తోంది. అన్ని వ్యవహారాలూ సచివాలయంతో ముడిపడినప్పుడు అక్కడి నుంచి విధులు ఎలా నిర్వహించాలని ఉద్యోగులు అంటున్నారు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయని, ఇప్పటికిప్పుడు కుటుంబాన్ని ఎలా తరలించాలని ప్రశ్నిస్తున్నారు. మూకుమ్మడి సెలవులపై వెళ్తామని హెచ్చరిస్తున్నారు. కాగా, నూతన రాజధానిలో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించిన తర్వాతే కార్యాలయాలను తరలించాలని ఏపీఎన్ జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు.