: ఆ సమయం అపూర్వమైనది: సచిన్


2011లో ప్రపంచకప్ ను గెలుచుకున్న సమయం అపూర్వమైనదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపాడు. మరోమూడు రోజుల్లో వరల్డ్ కప్ మొదలు కానున్న నేపథ్యలో సచిన్ గత స్మృతులను నెమరువేసుకున్నాడు. కప్ గెలిచిన తరువాత తాను ఆనందంతో ఏడ్చానని చెప్పాడు. సచిన్ తో పాటు టీమిండియా మొత్తం ఏడ్చిందని ధోనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ రాత్రి డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లు, వారి కుటుంబాలు, స్నేహితులు, అభిమానులతో కలసి సంబరాలు చేసుకున్నారని సచిన్ చెప్పాడు. టీమిండియా మరోసారి దానిని పునరావృతం చేయాలని సచిన్ ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News