: 200 మందిని సముద్ర కెరటాలు మింగేశాయి
200 మందిని మధ్యదరా సముద్ర కెరటాలు మింగేశాయని అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి. 300 మంది లిబియా వాసులు తీవ్ర ప్రతికూల వాతావరణంలో కిక్కిరిసిన మూడు రబ్బరు బోట్లలో ఇటలీ బయల్దేరారు. శనివారం బయల్దేరిన ఈ పడవలు ఈ పాటికి ఇటలీ చేరి ఉండాల్సింది. కానీ ఒడ్డు చేరలేదు. దీంతో నాలుగు రోజుల పాటు ఇటలీ దళాలు కనిపించకుండా పోయిన రబ్బరు బోట్ల కోసం అన్వేషణ సాగించాయి. ఈ అన్వేషణలో రెండు పడవల్లోంచి బతికి బట్టకట్టిన 9 మందిని రక్షించాయి. రెండు పడవల్లోని 203 మందిని సముద్ర కెరటాలు మింగేశాయని ఐక్యరాజ్యసమితి శరణార్థ సంస్థ తెలిపింది. మూడో పడవను శనివారం ట్రిపోలీ సమీపంలో గుర్తించాయి. దీంతో ఆ పడవలో ఉన్న 100 మందిని కాపాడాయి. కాగా, పడవలోని 29 మంది అప్పటికే మృతి చెందారు.