: ఏపీ అదనంగా నీరు వాడటంవల్లే సాగర్ లో నీటిమట్టం తగ్గింది: హరీశ్ రావు


ఆంధ్రప్రదేశ్ అదనంగా నీరు వాడటంవల్లే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మొత్తం 44 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా వాడుకుందని చెప్పారు. ఈ క్రమంలో సాగర్ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేయాలని నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఆదేశించారు. ఏపీ ఫిర్యాదులు మానుకుని నీటి విడుదలపై అధికారికంగా లేఖ రాస్తే సానుకూలంగా స్పందిద్దామని, అప్పటివరకు నీరు విడుదల చేయకూడదని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News