: ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసం తహతహలాడుతున్నారు: షానవాజ్ హుస్సేన్
ముఖ్యమంత్రి పీఠం కోసం జేడీ(యూ) నేత నితీష్ కుమార్ తహతహలాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నితీష్ అక్రమ మార్గంలో శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనట్టు న్యాయస్థానమే తేల్చిందని గుర్తు చేశారు. నితీష్ వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, లేదో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుందో శాసనసభలోనే చెబుతామని ఆయన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా బల నిరూపణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.