: 'ఎంఈకే' హాట్ సీట్ లో హీరో ధనుష్
నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' (ఎంఈకే) రెండవ సీజన్ లో తమిళ హీరో ధనుష్ పాల్గొన్నాడు. తాను నటించిన 'అనేకుడు' (తమిళ డబ్బింగ్) సినిమా ప్రమోషన్ కోసం చిత్ర దర్శకుడు కెవి ఆనంద్ తో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నాగ్ అడిగే పలు ప్రశ్నలకు ధనుష్ సమాధానం ఇవ్వనున్నాడు. తన చిత్రానికి సంబంధించిన పలు విషయాలను కూడా పంచుకోనున్నాడు. తమ సినిమాల ప్రమోషన్ కోసం ఇటీవల పలువురు హీరోలు ఈ షోలో పాల్గొంటున్నారు. అటు ఆడియన్స్ ను అలరిస్తూ, ఇటు ఎంఈకే షోకు ఆదరణ తెస్తున్నారు.