: ప్రపంచకప్ విజేత ఆఫ్ఘనిస్థానే... తేల్చి చెప్పిన రోబో


విరుచుకుపడే బ్యాట్స్ మెన్, వేగంతో బెంబేలెత్తించే పేస్ బౌలర్లు, బంతిని గింగిరాలు తిప్పగల స్పిన్నర్లు, మైదానంలో పాదరసంలా కదిలే ఫీల్డర్లను కలిగి, ఇప్పటికే ప్రపంచ కప్ ను తమ ఖాతాలో వేసుకున్న అగ్రశ్రేణి జట్లను కాదని క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్థాన్ ఈసారి ప్రపంచకప్ ను ఎగరేసుకుపోతుందట. న్యూజిలాండ్ లోని కాంటర్ బరీ విశ్వవిద్యాలయానికి చెందిన రోబో 'ఇక్రమ్' ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 14 జట్ల జాతీయ పతాకాలను తదేకంగా పరిశీలించిన ఈ రోబో... చివరకు ఆఫ్ఘనిస్థాన్ వైపే మొగ్గు చూపింది. టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ గెలిచే అవకాశాలు చాలా తక్కువైనప్పటికీ... క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని రోబో సృష్టికర్త ఎడ్వర్డో సాండోవల్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News