: డైమండ్ నెక్లెస్ పోయిందంటూ నటి సోనమ్ కపూర్ ఫిర్యాదు


ముంబయిలోని తమ నివాసంలో డైమండ్ నెక్లెస్ పోయిందంటూ జూహు పోలీసులకు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పేరు తెలియని వ్యక్తిపై దొంగతనం కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 5న సోనమ్, ఆమె తల్లి సునీతలు పోలీస్ స్టేషన్ కు వచ్చి సెక్షన్ 380 కింద ఫిర్యాదు చేశారని జూహు పోలీసులు తెలిపారు. ఈ నెల 4న బాంద్రాలోని ఓ పార్టీకి తాను హాజరయ్యానని, అప్పుడే నెక్లెస్, ఇతర నగలు ధరించానని... ఆరోజు ఆలస్యంగా ఇంటికి వచ్చానని సోనమ్ చెప్పారన్నారు. తరువాత ఇంటిలో 2 గంటలకు నెక్లెస్ ను ఒక సొరుగులో పెట్టారని, కానీ తరువాతి రోజు పోయినట్టు గుర్తించారన్నట్టు తెలిపారన్నారు. ఆ నెక్లెస్ విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News