: నోరు జారితే అంతే సంగతులే... నిషేధం తప్పదు
కాలు జారినా పర్వాలేదు, నోరు మాత్రం జారకూడదని అంటుంటారు. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో మాత్రం ఈ సూత్రాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. ఎదుటి ఆటగాళ్లను రెచ్చగొడుతూ, నోరు పారేసుకునే ఆటగాళ్ల నోటి దురుసుకు కళ్లెం వేయడానికి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అవతలి జట్టు ఆటగాడిపై నోరు పారేసుకున్నట్టు తేలితే, వెంటనే ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. చేసిన తప్పు మరింత ఎక్కువగా ఉంటే మ్యాచ్ ఫీజులో కోత కూడా ఉంటుంది. అందుకే, ఆటగాడు కాలుజారినా పర్వాలేదు, పెయిన్ కిల్లర్ వాడి ఆట కొనసాగించవచ్చు... నోరు జరితే మాత్రం ఒక మ్యాచ్ నిషేధానికి గురికాక తప్పదు.